WGL: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ అయినట్లు DIEO డా. శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఆదేశాలతో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ బోధనకు ఉపకరించే సామాగ్రి పంపిణీ అయినట్లు తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ. 6లక్షల పైగా విలువైన సామాగ్రి అందిస్తుండగా నేడు గీసుకొండ కళాశాలకు అందించామన్నారు.