వరంగల్లో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తెలిపారు. గురువారం మ. 2 గంటలకు ఖమ్మం రోడ్ ఇసుక అడ్డాల వద్ద ఓ గార్డెన్లో సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 1:30కు వరంగల్ చౌరస్తాలో ఆయనకు ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి స్వాగత ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు.