ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ అధ్యాయం ముగిసింది. 2011లో సిడ్నీ వేదికగా యాషెస్ 5వ టెస్టులో అరంగేట్రం చేసిన అతను.. అదే మైదానంలో యాషెస్ 5వ టెస్టులోనే ఇవాళ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ తరఫున 88 టెస్టులు, 40 వన్డేలు, 9 T20లు ఆడిన ఖవాజా.. 18 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలతో మొత్తం 8024 రన్స్ చేశాడు.