NGKL: ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన పెళ్ళూరి అమృతయ్యకు అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జ్ జీ. స్పందన మూడు రోజుల జైలు శిక్ష బుధవారం విధించారని ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదన్నారు. వాహనదారులు మోటార్ వాహన చట్టం, రోడ్ భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాల్సిందని హెచ్చరించారు.