నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనెల 9 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆర్ఎం కే. జాన్ రెడ్డి తెలిపారు. మొత్తం 298 ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. నల్గొండ 36, మిర్యాలగూడ 44, దేవరకొండ 62, నార్కట్ పల్లి 42, సూర్యాపేట 28, కోదాడ 42, యాదగిరిగుట్ట 44 బస్సులు కేటాయించినట్లు పేర్కొన్నారు.