»Tirumala Increased Rush Of Devotees 24 Hours Time For Darshan Of Srivari
Tirumala: పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala: Increased rush of devotees.. 24 hours time for darshan of Srivari
Tirumala: శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న శ్రీవారిని 65, 392 మంది యాత్రికులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 29, 015 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండి ఆదాయం 4. 23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. సాయంత్రం పుష్పపల్లకిలో మలయప్పస్వామి దర్శనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే, తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీ నుంచి 20 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఇందు కోసం జూలై 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు అప్పుడప్పుడు జరుగుతాయి.. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు జరుపుతారు.