బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే హిందీలో నిన్న ఈ సినిమా రూ.34.70CR సాధించింది. దీంతో బాలీవుడ్లో అల్లు అర్జున్ ‘పుష్ప 2′(రూ.27.50కోట్లు) రికార్డును ఇది బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ‘ఛావా'(రూ.24.30CR), ‘యానిమల్'(రూ.23.53CR)తో ఉన్నాయి.