TG: మెస్సీ మ్యాచ్‌పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. లాటిన్ అమెరికా దేశాల్లో ఫుట్‌బాల్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ‘మారుమూల పల్లెల్లోనూ ఫుట్‌బాల్ కోర్టులు కనిపిస్తాయి. సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ఆటలో పాల్గొనడం యువ క్రీడాకారులకు ఉత్సాహం కల్పించడానికి తోడ్పడుతుంది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేలా మౌలిక వసతులు కల్పించాలి’ అని పేర్కొన్నారు.