VZM: విద్యార్ధినులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఈ.నర్సింహమూర్తి సూచించారు. స్థానిక కస్పా ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం స్టేషన్ను సందర్శించి పలు విషయాలను తెలుసుకున్నారు. మంచి భవిష్యత్తును నిర్ణయించేది చదువేనన్న విషయాన్ని విద్యార్థులు ముందుగా గుర్తించాలన్నారు.