VSP: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సివిల్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించిన ఏయూ సెంటెనరీ అలుమ్ని మీట్ శనివారం ఘనంగా జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చీఫ్ ఇంజినీర్ బి.బ్రహ్మానయ్య, ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజులను ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏయూ దేశానికి గొప్ప ఇంజినీర్లను అందించిందన్నారు.