NRPT: నారాయణపేట మండలం పేరపల్ల గ్రామంలోని అశోక్ గౌడ్ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంను పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా దాడులు నిర్వహించి రూ.65,600 వేల విలువైన మొత్తం 181 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.