అన్నమయ్య: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యమని ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య తెలిపారు. శనివారం రాయచోటి డివిజన్లోని మాసాపేట సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన, ఇంజనీర్లతో సమావేశమయ్యారు. వ్యవసాయ కనెక్షన్లు సీనియార్టీ ప్రకారం ఇవ్వాలని, లైన్ అంతరాయాలు తగ్గించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.