ADB: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ శనివారం పర్యటించారు. మండలంలోని శాంతపూర్ గ్రామానికి చెందిన రాయమల్ సబ్లే తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని ఎంపీ నగేశ్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు.