GNTR: తెనాలి మండలం పెదరావూరు సెంటర్లో రూరల్ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సీఐ నాయబ్ రసూల్, ఎస్సై ఆనంద్ తనిఖీల్లో పాల్గొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గుర్తించారు. కొల్లూరు మండలం పెసర్లంక కృష్ణానది తీరం నుంచి ఇసుక లోడ్ చేసుకొని ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న 7 ట్రాక్టర్లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.