ATP: గుంతకల్లులోని ఆదర్శనగర్లో ఈనెల 12న పాత కక్షలు కారణంగా చంద్ర అనే వ్యక్తిని వేట కొడవలితో హత్య చేసిన ఘటనలో శనివారం శివ అనే ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. టూ టౌన్ సీఐ మనోహర్ మాట్లాడుతూ.. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్య చేసిన శివను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి వేటకొడలిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.