TG: సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద దారుణం చోటుచేసుకుంది. స్టేషన్ నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు బోడుప్పల్‌కు చెందిన నిత్యతేజగా గుర్తించారు. నిన్న సాయంత్రం 6 గంటలకు తేజ స్టేషన్ నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. తీవ్రగాయాలైన అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తేజ మృతి చెందిన వైద్యులు నిర్థారించారు.