స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీడియో అనలిస్ట్ రాజారెడ్డిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రెండేళ్ల కిందట ఆంధ్ర vs మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో అతను ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన బీసీసీఐ.. నేరం రుజువు కావడంతో కండక్ట్ కోడ్ ఆర్టికల్స్ 2.1.3, 2.1.14 కింద చర్యలకు ఉపక్రమించింది. అతడిపై జీవితకాల నిషేధం విధించింది.