ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రొటోకాల్స్ వివాదంపై బన్ని మేనేజర్ శరత్ చంద్ర స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ను కలవడం కష్టమని అనుకుంటే పొరపాటే అవుతుందని పేర్కొన్నాడు. ఇటీవల ఓ బ్రాండ్ స్ట్రాటజర్ బన్నీ కలవాలంటే 42 నిబంధనలు పాటించాలంటూ వ్యాఖ్యనించటం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.