GNTR: ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులను మిల్లు యజమానులు అగౌరవంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం మిల్లు వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ జియావుల్ హక్ రైస్ మిల్లు వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మిల్లు యజమానులు రైతుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.