W.G: ఈనెల 15న నరసాపురం నుంచి చెన్నైకు వెళ్లే వందేభారత్ రైలు ప్రారంభం కానుందని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. ఇవాళ భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో వందేభారత్ రైలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. నరసాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి, 3.20 గ.లకు భీమవరం టౌన్, 4.05 కు గుడివాడ, 4.55 విజయవాడ మీదుగా రాత్రి 11.45 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుందన్నారు.