MDK: పెద్ద శంకరంపేట మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు శనివారం ఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాలు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందజేయాలని సూచించారు.