NLR: కొడవలూరు (M) ఆలూరుపాడు కుమ్మరగుంటలో తాగునీటి మోటారు పనిచేయలేదు. దీంతో గత కొద్దిరోజుల నుంచి ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్థులు సమస్యను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆమె నూతన తాగునీటి మోటారును ఏర్పాటుచేసి సరఫరాను పునరుద్ధరించారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.