NTR: విజయవాడ జక్కంపూడి లోని టిడ్కో కాలనీలో ఎమ్మెల్యే బోండా ఉమా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాల నిర్మాణ పురోగతి, మౌలిక వసతులు, నీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్ వంటి అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన గృహాలు, సౌకర్యవంతమైన వసతులు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.