VZM: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 9,513 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్లో సివిల్ 424, క్రిమినల్ 9,028, ప్రీ–లిటిగేషన్ 61 కేసులు పరిష్కారమయ్యాయని ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు.