దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రభుత్వం ‘ఎయిర్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. వెంటనే ‘గ్రాప్-4’ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. దీంతో కాలుష్యం కలిగించే వాహనాలపై నిషేధం విధించారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో.. అత్యవసరమైతే తప్ప వాహనాలు బయటకు తీయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.