SRD: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. జరా సంఘంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 14న ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుందన్నారు.