TG: మెస్సీ, CM రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఛైర్మన్ శివసేనా రెడ్డి స్పందించారు. ఇది 90 నిమిషాల మ్యాచ్ కాదని, ఫ్రెండ్లీ మ్యాచ్ అని తెలిపారు. ‘మెస్సీ 10 నిమిషాల మ్యాచ్ ఆడతారు. క్రీడలను ప్రోత్సహించడానికి జరుగుతున్న మ్యాచ్. యువతను క్రీడలవైపు మళ్లించేందుకు CM తీసుకున్న నిర్ణయం ఇది. కోల్‌కతా వంటి ఘటనలు HYDలో జరగవు’ అని తెలిపారు.