W.G: తాడేపల్లిగూడెంకు చెందిన పాలూరి చిరంజీవి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆరవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తృతీయ స్థానం సాధించినట్లు నేషనల్ యోగా కోచ్ బడుగు చంద్రశేఖర్ శనివారం తెలిపారు. అనంతపురంలో ఈ నెల 12, 13వ తేదీల్లో ఈ పోటీలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆయన అభినందించారు.