GNTR: తుళ్ళూరు CRDA ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కన్నబాబు శనివారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌లో మొత్తం 45 అర్జీలు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. వీటిలో అమరావతిలో భూమి వ్యవహారాలకు సంబంధించి అత్యధికంగా 31 అర్జీలు వచ్చాయి. డెవలప్మెంట్ ప్రమోషన్ 6, సామాజిక సంక్షేమం 4, ప్లానింగ్ 3, ఎస్టేట్స్ 1 అర్జీ వచ్చినట్లు ఆయన వివరించారు.