ELR: ఏలూరు తూర్పు వీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతర ఉత్సవాలు ఇవాళ అంబరాన్నంటాయి. జాతర ఘట్టంలో భాగంగా వినుకొండ అంకమ్మ అమ్మవారిని ఆవాహనం చేసి, విచిత్ర వేషధారణలతో నగరంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్ ను ఆయన స్వయంగా కొంత దూరం నడిపారు