VSP: మెగా డీఎస్సీ–2025లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగానికి చెందిన 52 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో 52 మందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.