SRPT: అత్యవసర వైద్య సేవల్లో ముఖ్యంగా గుండె ఆగిపోయిన వ్యక్తికి మళ్లీ ప్రాణం పోసే శక్తి కేవలం సీపీఆర్ కే ఉందని డాక్టర్ అభిరామ్ తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిపిఆర్ పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.