MDK: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌గా గెలిపించాలని పిలుపునిచ్చారు. కొల్చారం మండల పరిధిలోని రంగంపేట, చిన్న గణపురం గ్రామాల్లో ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.