SS: కదిరిలోని నిజాం వలి కాలనీలో శనివారం ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కలు బాలుడి చెవిని కొరికి, తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడద ఎక్కువైందని, ఇకనైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి కుక్కలపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.