GDWL: మల్దకల్ మండలంలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని మండల ప్రత్యేక అధికారి సంగీతలక్ష్మి తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ ఏర్పాటు చేసి రూట్ల వారీగా పోలింగ్ సిబ్బందిని, బ్యాలెట్ బాక్స్‌లను, ఎన్నికల సామాగ్రిని తరలించారు. రేపు మండలంలో మొత్తం 21 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుందన్నారు.