SS: ఓబులదేవరచెరువు మండలం చింతమానుపల్లి పంచాయతీలో వైసీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుట్టపర్తి వైసీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కమిటీలు కృషి చేయాలని శ్రీధర్ రెడ్డి సూచించారు.