PPM: సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్న శుభ్రం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ ప్రభాకరరెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర అధికారులతో కలసి మంత్రి శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.