VKB: చౌడపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ దొంగతనం జరిగింది. శనివారం ఉదయం గుడికి వచ్చిన భక్తులకు హుండీ కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హుండీలో ఎక్కువ మొత్తం డబ్బులు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.