ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు 400 మంది హాజరు కావాల్సి ఉండగా, 374 మంది హాజరయ్యారని తెలిపారు. 26 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.