ASR: కూటమి పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అన్నారు. శనివారం అడ్డతీగల మండలం తుంగమడుగుల, దుచ్చర్తి, బందమామిళ్లు, గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాకోడులో పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.