AP: డ్రగ్స్‌కి బానిసైన కూతురును చూడలేని ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరుకు చెందిన యువతి ఇన్‌స్టాలో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమలో పడిందని.. అతను ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశాడని ఈగల్ చీఫ్ RK రవికృష్ణ తెలిపారు. దీన్ని చూడలేని ఆ తల్లి.. తన కుమార్తెకు వేరే పెళ్లి చేయాలనుకోగా, తల్లిబిడ్డలు గొడవ పడ్డారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తల్లి సూసైడ్ అటెంప్ట్ చేసిందన్నారు.