ASR: డుంబ్రిగుడ మండల గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి మూడు నెలలకు నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం శనివారం చప్పగా జరిగింది. ప్రజాప్రతినిధులు సమస్యలపై పెద్దగా స్పందించకపోవడంతో సమావేశం నామమాత్రంగా సాగింది. పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖల అభివృద్ధి పనులను అడ్డంకులు లేకుండా పూర్తి చేయాలని సభ్యులు కోరారు.