CTR: రొంపిచర్ల జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కి చెందిన నాగ సింధు, షబ్రీన్, మహేశ్వరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో జిల్లాస్థాయి కౌశల్ సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఇందులో ఈ ముగ్గురు ప్రతిభ చూపించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరిని డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించి నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.