కర్నూలులో వాహనదారులు తమ ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ అన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు శనివారం బిర్లా కాంపౌండ్ వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అవగాహన కల్పించడంతో పాటు ఫైన్ వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేనిచో జరిమానాలు తప్పవని సీఐ హెచ్చరించారు.