TG: మెస్సీ, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోల్కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. రాచకొండ కమిషనర్ ఎప్పటికప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.