PPM: సామాన్యులతో పాటు ఉన్నతాధికారులు సైతం తమ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాధినిరోధక టీకాలను వేయించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం సంతోషకరమని, ప్రజలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం జిల్లా అధికారి డా. టి. జగన్ మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం టీకా కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు.