MBNR: మాచారం గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పానుగంటి కావేరికి మద్దతు తెలిపి, ఆమెకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని ప్రజలు, ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.