NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. డిచ్ పల్లిలో పర్యటించి పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రితో సిబ్బంది తరలింపు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.