NTR: గతేడాది గానుగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 522 మార్కులు సాధించిన తేజశ్రీకి ఇవాళ రూ. 5 వేల ఆర్థిక ప్రోత్సాహం అందించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎస్.వి.వి.ఎస్.ఆర్. ఆంజనేయులు సౌజన్యంతో ఈ సహాయం అందించగా, పాఠశాల పూర్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు రాంప్రదీప్ సిబ్బందితో కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.