ATP: గుమ్మగట్ట మండలం కోనాపురం గ్రామంలో ఆంజనేయుడు రథోత్సవ వేడుకలను శనివారం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబెర్ గౌని ఉపేంద్రారెడ్డి రథోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అంజన్న నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.